ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోవిందాపురం వద్ద యథేచ్ఛగా సంచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 09:19 AM

జిల్లాలోని గోవిందాపురం రేవులో పరిమితికి మించి వాహనాలు, ప్రయాణికులను ఎక్కించడం, రక్షణ చర్యలు లేకపోవడంతో పాటు అస్తవ్యస్త నిర్వహణతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నదిలో గుంటూరు జిల్లా వైపు నుంచి తెలంగాణలోని జిల్లాలు, కృష్ణా జిల్లాకు రాకపోకలకు గతంలో పడవలు, బల్లకట్లు నడిపేవారు. సెప్టెంబరు 2019లో కచ్చలూరు బోటు ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం నదిలో రాకపోకలు నిలిపేసింది.


అప్పట్లో కొన్ని రోజులు పడవలు, బల్లకట్లు ఆగిపోయాయి. నదిలో రాకపోకలకు జిల్లా పరిషత్తు వేలం నిర్వహణ ద్వారా నిర్వాహకులకు బల్లకట్టు అనుమతించేది. ఇలా ఏడాదికి సగటున రూ. 1. 75కోట్ల సొమ్ము జడ్పీకి ఆదాయం సమకూరేది. ఇటీవల ప్రభుత్వం నదిలో రాకపోకలకు అనుమతిచ్చింది. దీంతో పడవలు, బల్లకట్టు నిర్వహణకు జడ్పీ జనవరిలో ఒకసారి, తాజాగా ఫిబ్రవరి 10న వేలం నిర్వహించింది.


అయితే చింతపల్లి రేవులో పడవ నడపడానికి మాత్రమే రూ. 1. 20లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. గోవిందాపురం, మాదిపాడు, తాడువాయి రేవుల్లో పడవలు, బల్లకట్టు నడపడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. గోవిందాపురం, మాదిపాడు బల్లకట్లు ఇప్పటికే అనధికారికంగా తిరుగుతూనే ఉన్నాయి. అక్రమంగా తిప్పుతున్న వారు ఇతరులు వేలంలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఏటా రూ. 50 లక్షలుపైగా లీజు రూపంలో జడ్పీకి చెల్లించకుండానే జేబులు నింపుకొంటున్నారు.


నిర్వాహకులు, పడవల యజమానులు కృష్ణానది పరిరక్షణ విభాగం నుంచి ఫిట్‌నెస్‌ ధ్రువపత్రం తెచ్చుకోవాలి. ఎంత బరువు ఎక్కించాలో నిర్ణయిస్తారు. నది దాటించడానికి హద్దులు నిర్ణయిస్తారు. వీటితోపాటు బల్లకట్టు నడిపే సారంగులు(డ్రైవర్లు)కు అనుమతి పత్రాలు మంజూరు చేస్తారు.


గతంలో లెక్కలతో పోలిస్తే జిల్లా పరిషత్తుకు రూ. కోటికిపైగా ఆదాయానికి గండిపడింది. 2021 నుంచి గోవిందాపురం బల్లకట్టు తిరుగుతూనే ఉంది. రాజకీయ నాయకుల అండ నిర్వాహకులకు దండిగా ఉండటంతో యథేచ్ఛగా తిప్పుతున్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు గజ్జల శ్రీనివాసరెడ్డి, జడ్పీ సీఈవో. గోవిందాపురం రేవుకు వేలం పిలిచినా ఎవరూ రాలేదు. అనధికారికంగా నదిలో బల్లకట్టు తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బల్లకట్టు తిరుగుతున్న సమయంలోనే పట్టుకుంటాం. మాచవరం ఎంపీడీవోకు ఆదేశాలు ఇస్తాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa