ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు వరం..పీఎం-జేఏవై

national |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 12:59 AM

పేదలకు వరం ‘ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(పీఎం-జేఏవై)’ పథకం అని చెప్పవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(పీఎం-జేఏవై)’ను లాంచ్ చేసింది. ఈ పథకం కింద ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్ రెండో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఝార్ఖాండ్‌లోని రాంచీలో 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం. ఈ పథకం వల్ల దాదాపు 10 కోట్ల పేద కుటుంబాలు లబ్ది పొందుతాయి. లబ్దిదారులు సుమారు 50 కోట్ల మంది ఉంటారని అంచనా. భారత జనాభాలో 40 శాతం మంది ఈ స్కీమ్ కిందకు వస్తున్నారు. ఈ స్కీమ్ లబ్దిదారులను సామాజిక, ఆర్థిక, కుల జనగణన(సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్) ఆధారంగా అంచనావేస్తారు. ఆర్థికంగా నిరుపేదలైన వారు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సినవసరం లేకుండా.. ఈ స్కీమ్ కింద ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయినా లబ్దిదారులు ఉచితంగా ఆరోగ్యసేవలను పొందవచ్చు. పీఎం-జేఏవై ఫీచర్లు ఇలావున్నాయి.కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య ఇన్సూరెన్స్, సంరక్షణ పథకం పీఎం-జేఏవై., దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఒక్కో కుటుంబం ఒక్కో ఏడాది రూ.5 లక్షల వరకు చికిత్స చేయించుకోవచ్చు. 10.74 కోట్లకు పైగా పేద, వెనుకబడిన వర్గాల కుటుంబాలకు ప్రయోజనం


లబ్దిదారులకు ఆరోగ్య సంరక్షణ సేవలను నగదు రహితంగా ఇది అందిస్తోంది. కుటుంబ పరిమాణం, వయసు లేదా లింగంపై ఎలాంటి ఆంక్షలు లేవు.


తొలి రోజు నుంచి అన్ని ఆరోగ్య చికిత్సలకు ఇది కవర్ అవుతుంది. పీఎం-జేఏవై పథకం కింద రోగిని ఆస్పత్రిలో చేర్చిన నాటి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులను కేంద్రమే భరిస్తుంది.


పీఎం-జేఏవై స్కీమ్‌కి ఎవరు అర్హులు...


16 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మగవాళ్లు లేని వారు, సంపాదించే వ్యక్తి లేని కుటుంబాలు, ఇంట్లో దివ్యాంగులు ఉండి, ఆరోగ్యకరమైన వ్యక్తులు లేని కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేకుండా.. కేవలం రోజువారీ కూలీపైనే ఆధారపడి జీవిస్తున్న వారు. పట్టణ ప్రాంతాలలో వారు చేసే పనుల ఆధారంగా లబ్దిదారులను గుర్తిస్తారు. బిచ్చగాళ్లు, కూలీలు, నిర్మాణ కూలీలు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, ప్లంబర్లు, బట్టలు ఉతికేవారు, తోటమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, రిక్షా తొక్కేవారు, కండక్టర్లు, వెయిటర్, అసిస్టెంట్, డెలివరీ అసిస్టెంట్, వీధి వర్తకలు, చిన్న చిన్న సంస్థలో రోజువారీ కూలీలుగా పనిచేవారు ఈ పథకం కింద లబ్ది పొందవచ్చు.


పీఎం-జేఏవై స్కీమ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?


మీరు పీఎం-జేఏవై స్కీమ్‌లో రిజిస్టర్ కావాలంటే కింద ప్రక్రియలను పాటించాలి. అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ https://pmjay.gov.in/లోకి వెళ్లాలి. నేను అర్హుడిని అవుతానా అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేస్తే , మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీ రాష్ట్రం పేరు, మీ పేరు, రేషన్ కార్డు నెంబర్, ఇంటి నెంబర్ లేదా మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. ఒకవేళ మీ కుటుంబం ఆయుష్మాన్ భారత్ యోజన కింద కవర్ అయితే.. మీ పేరు డిస్‌ప్లే అవుతుంది. టోల్ ఫ్రీ నెంబర్లు ఇలా ఉన్నాయి. పీఎం-జేఏవైకి అర్హత కలిగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్‌ని సంప్రదించవచ్చు. లేదా ఆయుష్మాన్ భారత్ యోజన కాల్ సెంటర్ నెంబర్ 14555 లేదా 1800 111 565కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్‌కి కావాల్సిన డాక్యుమెంట్లు.. వయసు, గుర్తింపు కార్డు(ఆధార్ లేదా పాన్ కార్డు) కాంటాక్ట్ వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయపు ధ్రువీకరణ పత్రం(ఏడాదికి రూ.5 లక్షల వరకే ఆదాయం ఉన్న సర్టిఫికేట్), ఈ స్కీమ్ కింద మీ ఫ్యామిలీ కవర్ అయ్యేందుకు అవసరమయ్యే డాక్యుమెంట్ ప్రూఫ్


పీఎం-జేఏవై కింద కవర్ అయ్యే ప్రమాదకర జబ్బులు..


1,350 మెడికల్ ప్యాకేజీలు దీని కింద ఆఫర్ చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద కవర్ అయ్యే ప్రమాదకర జబ్బులు కొన్ని..ప్రొస్టేట్ క్యాన్సర్, స్కల్ బేస్ సర్జరీ, పల్మోనరీ వాల్వే సర్జరీ, డబుల్ వాల్వే రిప్లేస్‌మెంట్ సర్జరీ, స్టెంట్‌తో కూడిన కరోటిడ్ యాంజియోప్లాస్టీ


ఆసుపత్రిలో చేరినప్పుడు అయిన ఖర్చులతో పాటు పరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్, ప్రీ హాస్పిటలైజేషన్, నాన్ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, డయాగ్నోస్టిక్స్, లేబోరేటరీ వంటి పలు ఖర్చులను ఈ పథకం కింద చెల్లిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ -19 హాస్పిటలైజేషన్ ఖర్చులను కూడా దీని కింద అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఐసోలేషన్, క్వారంటైన్ ఖర్చులను కూడా భరిస్తుంది. అన్ని ఎంపానల్డ్ ఆసుపత్రులలో కోవిడ్ పరీక్షలు, చికిత్స, క్వారంటైన్ సౌకర్యాలు అందించేలా ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద చికిత్స చేయడానికి ఆసుపత్రి నిరాకరిస్తే ఏం చేయాలి..?, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ రీడ్రెసల్ కమిటీని ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ ఫిర్యాదు దాఖలు చేస్తే.. 30 రోజుల్లో పరిష్కరిస్తారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఈ స్కీమ్ కింద కవర్ అవుతుందా అంటే అవును క్యాన్సర్ చికిత్స కూడా ఆయుష్మాన్ భారత్ యోజన కింద కవర్ అవుతుంది.


పీఎం-జేఏవై లో డేటాను ఎలా అప్‌డేట్ చేసుకోవాలి..?


ఈ స్కీమ్ కింద లబ్దిదారులు తమ డేటాను 14555 లేదా 1800-111-565 లేదా కామన్ సర్వీసు సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa