ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఏపీలోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి52 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ఆర్‌ఐశాట్-1, ఐఎన్‌ఎస్-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్-1 అనే మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లింది. ఆదివారం వేకువజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది 25.30 గంటలు కొనసాగిన తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa