మథుర: గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకుంది. అచ్నేరా-మథుర మార్గంలో గూడ్స్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన కారణంగా కాస్‌గంజ్-అచ్నేరా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa