ఆంధ్రప్రదేశ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ ఉదయం ఎలమంచిలి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పాయకరావుపేట ఉప ఎన్నిక జరుగగా, ఆ సమయంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టు అయ్యన్నపాత్రుడిపై కేసు దాఖలైంది. కోర్టు విచారణకు ఆయన సక్రమంగా హాజరు కాకపోవడంతో ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిన ఆయన, న్యాయమూర్తి ఎదుట హాజరై, తనపై ఉన్న ఎన్బీడబ్ల్యూను రీకాల్ చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై పెట్టిన తప్పుడు కేసు ఇదని ఆరోపించారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa