పోలండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విద్యార్థులకు ఊరట కలిగించేలా ఆదేశాలు జారీ చేసింది. వీసాలు లేకపోయినా భారతీయులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ ఉక్రెయిన్‌లో తలదాచుకుంటున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలండ్ ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. ఇప్పటికే బాంబుల మోత, క్షిపణి దాడులు జనావాసాలపైనా జరుగుతున్నాయి. ఇక ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా ప్రజలకు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఆ దేశంలో కర్ఫ్యూ విధించారు. దీంతో చేసేదేమీ లేక ప్రజలంతా బంకర్లు, అండర్ గ్రౌండ్‌లలోనే తలదాచుకుంటున్నారు. ఈ తరుణంలో తమ దేశ సరిహద్దు వద్దకు వచ్చే వారికి ఊరట కలిగించేలా పోలండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa