ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మార్గాల్లో భారత్ కు విమానాల నిలిపివేసిన అమెరికా

international |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 01:00 PM

రష్యాపై మండిపడుతున్న అమెరికా తాజాగా మరో నిర్ణయం తీసుకొంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం జ‌రుగుతుండ‌డంతో అమెరికా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ర‌ష్యా మీదుగా భారత్ కు విమానాలను నిలిపేసింది. ఈ వివ‌రాల‌ను అమెరికాకు చెందిన‌ యునైటెడ్ ఎయిర్‌ లైన్స్‌ ఈ రోజు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. త‌మ దేశం నుంచి ముంబై, ఢిల్లీకి చేరేందుకు రష్యా గగనతలాన్ని వినియోగించటాన్ని నిలిపివేసినట్లు స్ప‌ష్టం చేసింది. అయితే, తాము తీసుకున్న‌ ఈ నిర్ణయం తాత్కాలికమేనని వివ‌రించింది. ఇందుకు సంబంధించిన‌ పూర్తి వివరాలు వెల్లడించలేదు. అలాగే అమెరికన్ ఎయిర్‌ లైన్స్‌ కూడా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఢిల్లీ-న్యూయార్క్ మధ్య తిరిగే విమానాలు రష్యా గగనతలాన్ని వినియోగించకుండా నిలిపేశామ‌ని పేర్కొంది. ఇదిలావుంటే రష్యా విమానాలు అమెరికా గగనతలం మీదుగా వెళ్ల‌డాన్ని నిషేధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన అనంత‌రం విమానయాన సంస్థలు ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa