రబీ సీజన్లో పంటలను సాగు చేసిన రైతులంతా ఈక్రాఫ్ నమోదు చేసుకోవాలని వినుకొండ మండలం శావల్యాపురం ఇన్చార్జి ఏవో కంచుపాటి సునీత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రబీ సీజనులో మండలంలోని 15 గ్రామపంచాయతీ లలో 8646 ఎకరాలలో రైతులు వరి , మొక్కజొన్న , మినుము , పెసర , పొగాకు పంటలను సాగు చేశారని , ఇప్పటికీ 4100 ఎకరాలలో రైతులు మాత్రమే ఈక్రాఫ్ నమోదు చేయించుకొన్నారని తెలిపారు. ఈ క్రాఫ్ నమోదు చేయించుకోని రైతులు రైతుభరోసా కేంద్రాలలో వీఏఏలను కలసి తాము సాగు చేసిన పంట వివరాలను నమోదు చేయించుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa