విశాఖపట్నం: పాడేరు పట్టణం జిల్లా ఆసుపత్రి లో ఒక మతి స్థిమితం లేని వ్యక్తి ఈరోజు ఉదయం కోవిడ్ వార్డులో ఉన్నా బెడ్లు మీద నిప్పు అంటించాడు. దింతో మంటలు చెలరేగడంతో వార్డు మొత్తం దగ్ధం అయ్యింది. జరిగిన విశయం తెలుసుకున్నా ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమీషన్ సభ్యులు మత్యరాస విశ్వేశ్వర రాజు నేరుగా ఆసుపత్రి లో చేరుకుని జరిగినా ఘటన స్థలాన్ని పరిశీలించి జరిగిన వివరాలు ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని పోలీసు అధికారులు అధీనంలో తీసుకుని ఎవరికి ఎటువంటి హని జరగకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకి విశ్వేశ్వర కోరారు.