గత కొద్దివారాలుగా తగ్గుముఖం పట్టిన కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ కొవిడ్-19 టెక్నికల్ లీడ్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు మరియ వన్ ఖర్ఖోవ్ అన్నారు.కొద్దివారాలుగా తగ్గిన కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, నియంత్రణ చర్యలు ఎత్తివేసిన చోట కేసులు మరింత వేగంగా ప్రబలుతాయని ఆమె హెచ్చరించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా జరిగిన ప్రాంతాల్లోనూ నియంత్రణలు తొలగిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతుందని పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత, మరణాలను వ్యాక్సినేషన్ తగ్గించినా ఇన్ఫెక్షన్ బారినపడటం నుంచి మాత్రం టీకాలు కాపాడకపోవడం ఆశ్చర్యం కలిగించదని మరియ అన్నారు.ఒమిక్రాన్ అత్యధిక సంక్రమణ రేటును కలిగిఉండటం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఆఫ్రికా వంటి పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరగడంతో ఒమిక్రాన్ ప్రబలుతోందని అన్నారు. ముప్పు ఎక్కువగా ఉన్న జనాభాకు పూర్తి వ్యాక్సినేషన్ చేపట్టడం కీలకమని ఆమె హెచ్చరించారు.
![]() |
![]() |