రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఇవాళో, రేపో ఇంధన ధరలు పెరుగుతాయన్న భయాలు పోయాయని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అంతా భయపడిపోయారు.గ్లోబల్ మార్కెట్లలో ధర ఆకాశాన్నంటినా చమురు సంస్థలు పెంపు జోలికి పోలేదు. అయితే ఇప్పట్లో ధరలు పెంచే ఛాన్స్ లేదని తెలుస్తోంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని బ్యారెల్ చమురు ధర ఓ దశలో 139 డాలర్లకు చేరింది. దీంతో చమురు సంస్థలు భారీగా ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి.
లీటర్ పెట్రోల్‌పై 5 నుంచి 7 రూపాయలు నష్టపోతున్నామని కేంద్రానికి తెలిపాయి. ఇంతలోనే గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. తొలిసారిగా 100 డాలర్ల లోపు ట్రేడ్ అయింది బ్యారెల్ చమురు ధర. దీనికి తోడు.. భారత్‌కు రష్యా భారీ డిస్కౌంట్‌పై క్రూడాయిల్ సరఫరా చేస్తుండడంతో.. ఆ లోటు మరింత తక్కువైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న రేట్ కన్నా.. మనకు 20 నుంచి 30 శాతం డిస్కౌంట్‌పై చమురు సరఫరా చేస్తోంది రష్యా.
దీంతో మొన్నటి వరకు వచ్చిన నష్టాలను దీంట్లో పూడ్చేందుకు రెడీ అయ్యాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. 30 లక్షల బ్యారెళ్లు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఇక, భారత్ – రష్యా డీల్‌పై అమెరికా పెదవి విరిచింది. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొంటే ఆంక్షలు ఉల్లంఘన కాదు కానీ.. రష్యాను సమర్థిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందని అంటోంది అమెరికా. చరిత్ర పుస్తకాల్లో ఇండియా ఎక్కడ ఉండాలో ఆలోచించుకోవాలంటూ కామెంట్ చేసింది. భారత్ మాత్రం.. అమెరికా కామెంట్స్‌ను లైట్ తీసుకుంది. ఎక్కడ తక్కువ ధరకు వస్తే.. అక్కడే కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పింది.