సిద్ధవటం లంకమల అభయారణ్యంలోని ఎర్రచందనం మొక్కల పై సెంట్రల్ టీం ఐ. సి. ఎఫ్. ఆర్ ఐ. స్వప్న నంద్ పట్నాయక్ తమ సిబ్బందితో కలిసి పరిశోధన చేసేందుకు సిద్దవటం అటవీ కార్యాలయంలోని ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ ను కలిసి ఎర్రచందనం మొక్కల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ టీం ఐ సి ఎఫ్ ఆర్ ఐ సైంటిస్ట్ డాక్టర్ స్వప్న నంద్ పట్నాయక్ విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం పరిశోధన నిమిత్తం ఇక్కడికి రావడం జరిగిందని కడప జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 15 రోజులపాటు అడవి ప్రాంతంలో పర్యటించడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా విత్తనాలు సేకరిస్తున్నారు అలాగే చెట్టు కొమ్మల ఆకులను పరిశీలిస్తామన్నారు. రీసెర్చ్ పూర్తయిన తర్వాత కొత్తరకం మొక్కలు సృష్టించేందుకు రీసర్చ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పరశురాముడు బీట్ ఆఫీసర్లు సుబ్రహ్మణ్యం సెంట్రల్ టీం సిబ్బంది పాల్గొన్నారు.