మండలంలోని జ్యోతి ఇసుక క్వారీ నుంచి బుధవారం అధిక టన్నులతో వెళుతున్న 4 టిప్పర్లు, ఒక ఇసుక లారీని పట్టుకున్నట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు బిల్లు చెల్లించిన దాని కన్నా అధిక టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 4 టిప్పర్లు, ఒక ఇసుక లారీని ఎస్ఇబీ సీఐ ఉరుకుందమ్మ, ఒక ఇసుక లారీని ఎస్ఇబీ ఎస్సై పురుషోత్తం బాబులతో కలిసి పట్టుకోవటం జరిగిందన్నారు. ఈ మేరకు బాకరాపేట వద్ద కాటా వేయించి జరిమానా విధించే నిమిత్తం భూగర్భ గనుల శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.