ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, మోటార్ వాహనాల యాక్ట్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఆటో మరియు ట్రాలీ వర్కర్స్ యూనియన్ బద్వేలు పట్టణ కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు. స్థానిక మార్కెట్ యార్డు వద్ద కరపత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలను ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.