రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అసమానతలను తొలగిస్తున్నారని రైల్వేకోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల ఆర్థిక అభ్యున్నతికి ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నారని ఆయన అన్నారు.
సమాజంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపుతున్నారని కొరముట్ల అన్నారు. చట్టసభలలో సామాన్యులకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని శాసనసభ స్పీకర్ ను చేశారన్నారు. సంక్షేమ పథకాలు ఉద్యోగాల భర్తీ ఇలా అన్ని అంశాలలో బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత కల్పిస్తున్నారని రైల్వే కోడూరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.