జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మైలవరం మండల పరిధిలోని గంగుల నారాయణ పల్లి కి చెందిన ఈశ్వరమ్మ కూతురు నాగలక్ష్మి 15వ తేదీ ఉదయం నుండి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం దున్ని పాడు గ్రామానికి చెందిన మహేంద్ర అనే యువకునికి ఇచ్చి వివాహం చేయగా భార్య భర్తలు గంగుల నారాయణ పల్లి లో నివాసం ఉండే వారని, 15వ తేదీ ఉదయం నుండి నాగలక్ష్మి కనిపించడంలేదని వారి తల్లి నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.