మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని కుర్లా వాజిద్ అలీ కాంపౌండ్‌లో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెప్పారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.