ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాతృభాషను భవిష్యత్ తరాలకు అందించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 09:10 PM

ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణపై సీఎం చంద్రబాబు ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని చెప్పారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టారని అన్నారు.


ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందని చెప్పారు. అలాగే ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు పేరు పెట్టడం కూడా అభినందనీయమన్నారు. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగుభాషాభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మహా సభలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ నిర్వాహకులకు సీఎం చద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com