కజకిస్థాన్, దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదాలు మరవకముందే కెనాడలో మరో విమాన ప్రమాదం సంభవించింది. హాలిఫాక్స్ ఎయిర్ పోర్ట్‌లో ఎయిర్ కెనడా విమానం విరగిన ల్యాండింగ్ గేర్‌తో ల్యాండ్ అయ్యింది. గేర్ వద్ద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.