మహిళలు తమ సమస్యల కోసం చట్టాలను ఉపయోగించుకుని న్యాయం పొందాలని సీనియర్ సివిల్ జడ్జి, డిఎల్‌ఎస్‌ఎ సెక్రటరి ఎస్. కవిత అన్నారు. బుధవారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ (డిఎల్‌ఎస్‌ఎ) ఆధ్వర్యంలో నాగార్జు మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌కెఆర్ అండ్ ఎస్‌కెఆర్ మహిళా డిగ్రీ కళాశాలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి కవిత మాట్లాడుతూ డొమెస్టిక్ వాయిలెన్స్ యాక్ట్, పోక్సో చట్టం, 498-ఎ గురించి, నిర్భయ చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, వర్కింగ్ ఉమెన్ యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఉచిత న్యాయ సహాయం, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, పిసి అండడ్ పిఎన్‌డిటి యాక్ట్, దిశ చట్టం, మహిళా హక్కుల గురించి వివరించారు.
కార్యక్రమంలో న్యాయవాది శ్రీదేవి, ఎస్‌కెఆర్ అండ్ ఎస్‌కెఆర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామసుబ్బమ్మ, ఎస్‌ఎన్‌ఎస్ కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి, అధ్యాపకురాలు యువవాణి, నాగార్జున కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెడ్డెప్ప, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ సుబ్బ నరసయ్య, విద్యార్థినిలు పాల్గొన్నారు.