గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని గుజ్జనగుండ్లలో లూథరన్ చర్చి వద్ద గురువారం ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించి నష్టపోయిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే ప్రభుత్వం తరపున నష్టపరిహారాన్ని త్వరగా వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవికి రుణపడి ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.