పదో తరగతి చదువుతున్న విద్యార్థిని వసతిగృహ భవనం పై నుంచి దూకిన సంఘటన విజయపురి సౌత్ లో సోమవారం చోటు చేసుకుంది. మాచర్ల మండలానికి చెందిన బాలిక స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉన్నట్టుండి వసతి గృహ భవనం పైనుంచి దూకింది. బలమైన గాయాలు కావడంతో బాలికను నరసరావు పేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
బాలిక అత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటనపై కారణాలు ఏంటో తెలియరాలేదు. తాను చదివేచోట ఎవరైనా మందలించారా.. లేక ఇమైనా కారణాలున్నాయా అనే దానిపై చర్చ నడుస్తోంది. స్నేహితురాలు ఒకరు తనతో మాట్లాడకపోవడంతో మనస్తాపానికిలోనై దూకినట్లు బాలిక పేర్కొందని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి. జరిగిన సంఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని విజయపురిసౌత్ పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa