దేశంలో రోజురోజుకూ కామాంధుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఇక ఓ దళిత యువతిపై అధికార పార్టీకి చెందిన నాయకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరు నెలలుగా సాగుతున్న ఈ అకృత్యం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో యువతికి దగ్గరైన ఓ కీచకుడు తాము సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీశాడు. దానిని చూపించి ఆ యువతిని బెదిరించాడు. స్నేహితులతో కలిసి అకృత్యాన్ని కొనసాగిస్తున్నాడు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి(22)కి ప్రేమ పేరుతో శ్రీవల్లి పుత్తూర్ కి చెందిన హరిహరన్ దగ్గరయ్యాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా హరిహరన్ వీడియో తీశాడు. దానిని చూపించి బెదిరించి, తన స్నేహితులతో కలిసి ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. తనకు ఎదురవుతున్న వేధింపులను ఆమె తన స్నేహితుడు మాడ స్వామి అనే వ్యక్తికి తెలిపి బాధపడింది. ఈ కారణాన్ని అలుసుగా తీసుకుని అతడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. వీరి తీరు కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి దెబ్బతింది. కుటుంబ సభ్యులు ఆమెను వైద్యుల వద్ద చూపించినప్పుడు వారు గట్టిగా అడగడంతో ఆమె నిజాలన్నీ చెప్పేసింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నిందితులపై సోమవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa