ఏపీ సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 2023 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌కు అంకితం చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్సార్ ప్రారంభించారని, ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని సీఎం జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని సీఎం జగన్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa