ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేత

national |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 02:17 PM

కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రోజు వారీ కరోనా కేసులు 2 వేలకు దిగువన నమోదవుతుండడంతో కరోనా నిబంధనలను పూర్తిగా ఎత్తి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్ర హోం శాఖ ప్రకటన వెలువరించింది. మార్చి 31 నుంచి కోవిడ్ నిబంధనలు తీసి వేస్తున్నట్లు పేర్కొంది. అయితే కోవిడ్ వ్యాప్తి చెందకుండా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని వివరించింది. తాజా నిర్ణయంపై అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం సమాచారం అందించారు. దేశంలో కోవిడ్ విజృంభించడంతో రెండేళ్ల క్రిందట కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేసింది. కోవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. శుభకార్యాలు, అంతిమ యాత్రలలో పాల్గొనే వారి సంఖ్యను కుదించింది. పర్యాటక ప్రాంతాలు, సినిమా హాళ్లను మూసి వేయాలని పేర్కొంది. ఇలా పలు కఠిన నిబంధనలను తర్వాత కాలంలో సడలించినా ప్రస్తుతం పూర్తిగా ఎత్తి వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa