ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం టీటీడీ ప్రధాన లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 02:31 PM

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం ప్రధాన ఉద్దేశంగా టిటిడి పని చేస్తోందని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఋషి కొండ తీరంలో శ్రీ వారి ఆలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా ఆలయాలు టిటిడి అధ్వర్యంలో నిర్మిస్తామన్నారు.


సీఎం ప్రత్యేక శ్రద్ధతో ఋషి కొండ తీరంలో శ్రీ వారి ఆలయం నిర్మాణం పూర్తయిందన్నారు. ఋషి కొండ పై శ్రీ వారి ఆలయం ద్వారా ఉత్తరాంధ్ర లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. అమరావతి లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పూర్తయిందన్నారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ మహా విష్ణుకు ప్రీతికరమైన సముద్రిని చెంత శ్రీ వారి ఆలయం అత్యంత పవిత్రం అన్నారు. ఇది మరో తిరుమల కానుందన్నారు.


విశాఖలో శ్రీవారి ఆలయం ఉత్తరాంధ్ర లో ఆధ్యాత్మిక శోభ కు నాందిగా పేర్కొన్నారు. తిరుమల వెళ్ళ లేని భక్తులు రిషి కొండ లో శ్రీవారిని దర్శించుకుంటారన్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ ఈ రోజు విశాఖ జిల్లాకు శ్రీవారీ ఆలయం మహా భాగ్యం కలిగిందన్నారు సముద్ర తీరంలో శ్రీ వేంకటేశ్వరుడు దివి నుంచి భువికి వేoచేసినట్టుందన్నారు. సముద్రుని సన్నిధిలో శ్రీ మహా విష్ణువు కొలువు ఆ ప్రాంతానికి శుభ సూచకం అన్నారు. సమస్త పాపాలు తొలగాలంటే ఆలయ దర్శనం ఆవశ్యం అన్నారు. ఇక్కడి ఆలయం ధ్వజ స్తంభ దర్శనం అంతర్గత దోషాలు తొలగుతాయన్నారు.


అన్ని మతాల్లో హైందవ మతం శ్రేష్ఠ దాయకమని వైశాఖన పద్దతిలో పూజా కార్యమాలు జరగటం శుభ పరిణామం అన్నారు. విశాఖలో శ్రీ వారి ఆలయం నిర్మాణం కి కృషి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కి శ్రీ శారద పీఠం ఆశీస్సులు. శ్రీ వారి అనుగ్రహం వుంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa