ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి మదిలో ఉన్న నేత ఎవరో..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 03:29 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రి వర్గ విస్తరణపై క్లారిటీ ఇవ్వడంతో కర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా తాము మంత్రి కావాలనే ఉద్దేశంతో ఏ ఒక్క అవకాశాన్ని వారు వదులుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో మంత్రి రేస్ లో ఉన్న వారి పై స్పెషల్ స్టోరీ.


కర్నూలు జిల్లా వైఎస్ కుటుంబానికి ఎప్పుడు అండగనే నిలుస్తూ వస్తుంది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండూ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. ఆయన తరువాత 2014 లో టీడీపీ హయంలో కూడా 11ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ పార్టీ జిల్లాలో గెలుచుకుంది.


వైఎస్ జగన్ పాదయాత్ర తరువాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లాను స్వీప్ చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో శిల్పా మోహన్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనురు జయరాం మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు.


ఈ ఉగాదికి కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తుండడంతో జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు మంత్రి రేస్ లో పడ్డారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం నుంచి బాలానాగిరెడ్డి రేస్ లో ఉన్నారు.


మారో వైపు నంద్యాల పార్లమెంట్ పరిధిలో శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి రేస్ లో ఉన్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా చూస్తే ఎస్సీ సామాజిక వర్గం నుంచి కర్నూలు పరిధిలో డాక్టర్ జరదొడ్డి సుధాకర్, నంద్యాల పరిధిలో ఆర్థర్ ఉన్నారు. మైనారిటీకి ఇవ్వాలని చూస్తే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లైన్ లో ఉన్నారు. అయితే వీరంతా మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన సీనియర్లకు ఇస్తారా లేదా సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా కొత్త వారికి మంత్రి పదవి ఇస్తారా అనేది ఇప్పటికి సస్పెన్స్. కర్నూలు జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో మరి సీఎం మదిలో ఉన్న నేత ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa