ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కరోనా అప్డేట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 08:30 PM

ఆంధ్రప్రదేశ్ లో  గత 24 గంటల్లో  10,372 కరోనా పరీక్షలు చేయగా అందులో 31 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 11 కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు, ప్రకాశం, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు.అదే సమయంలో 66 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్త మరణాలు ఏవీ నమోదు కాలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,328 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23,04,148 మంది ఆరోగ్యంగా ఉన్నారు. మరో 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 14,730 మంది కరోనాతో మృతి చెందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa