ఉత్తరప్రదేశ్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. చాక్లెట్లు తిని నలుగురు పిల్లలు మృతి చెందారు. ఘటన వివరాల్లోకి వెళితే.. ఖుషీనగర్ జిల్లా కశ్యా ప్రాంతంలోని దిలీప్ నగర్‌లోని ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించింది. ఓ మహిళ బ్యాగ్ తెరిచి చూడగా ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు కనిపించాయి. పక్కింట్లో ఉంటున్న మరో చిన్నారి తన ముగ్గురు మనవళ్లకు చాక్లెట్లు ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కొద్దిసేపటికే పిల్లలు స్పృహ కోల్పోయారు. చిన్నారులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులను మంజన (3), స్వీటీ (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలు తిన్న చాక్లెట్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు ఖుషీనగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa