కరోనా కారణంగా నిలిపివేసిన ప్యాసింజరు రైళ్లను ఈ నెల 28, 29 తేదీల నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు 67209 గుంటూరు-తెనాలి, నెంబరు 67210 తెనాలి-రేపల్లె, నెంబరు 17263-17264 భీమవరం-నరసాపురం, నెంబరు 67279-67280 నడికూడి-మాచర్ల, 77203 విజయవాడ-నరసాపురం, 77206 భీమవరం-విజయవాడ, 77211 గుడివాడ-మచిలీపట్నం, 77220 మచిలీపట్నం-గుడివాడ, 77232 భీమవరం-మచిలీపట్నం, 77234 మచిలీపట్నం-గుడివాడ, 77237 భీమవరం-నిడదవోలు, 77240 నిడదవోలు-భీమవరం, 77241 నరసాపురం-నిడదవోలు, 77242 నిడదవోలు-భీమవరం, 77244 నిడదవోలు-భీమవరం, 77262 మచిలీపట్నం-విజయవాడ, 77270 మచిలీపట్నం-విజయవాడ, 77207 విజయవాడ-మచిలీపట్నం, 77298 విజయవాడ-భీమవరం రైళ్లను నడపనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa