మానసిక ఆవేదన ఆయన ఆత్మహత్యకు దారితీసింది. మంగళవారం మద్యంలో గడ్డిమందు కలిపి, తాగిన అత్తోట వాసి గుడారి అంకమ్మరావు (26) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పట్ల గత మాసంలో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు అందడంతో కొల్లిపర పోలీస్‌స్టేషన్‌లో ఈయనపై కేసు నమోదైందని తెలిపారు. ఈ క్రమంలో మానసిక వేదనకు లోనైన ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారముందన్నారు. మృతుని బంధువు జి. రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేపట్టామని కొల్లిపర ఎస్సై జె. బలరామిరెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa