ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క పిల్లి వల్ల రూ.100 కోట్ల నష్టం.. ఏం జరిగిందంటే

national |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 11:54 AM

మహారాష్ట్రలోని పుణెలో ఒక్క పిల్లి వల్ల 60 వేల ఇళ్లకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. పింప్రిలోని మహా ట్రాన్స్​మిషన్​ సబ్​స్టేషన్​ లోని ట్రాన్స్​ఫార్మర్​ పైకి ఓ పిల్లి ఎక్కింది. షార్ట్​ సర్క్యూట్ ​తో అది చనిపోయింది. దీని వల్ల భోసరీ, భోసరీ ఎంఐడీసీ, ఓకుర్ది ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు 60వేల కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. పవర్​ కట్​ ద్వారా తమ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని పింప్రి-చించ్​వడ్​ సూక్ష్మ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సందీప్​ బెల్సేర్​ పేర్కొన్నారు. పవర్​ కట్​ మరో 2 రోజుల వరకు కొనసాగవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, ఒకే ట్రాన్స్​ఫార్మర్​ పై లోడ్​ మొత్తం పడుతుందని ఎంఎస్​ఈడీసీఎల్​ అధికారి జ్యోతి చిప్టే తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa