ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెమటకాయల సమస్యకు చెక్ పెట్టండిలా

national |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 11:56 AM

వేసవిలో శరీరంలో నుంచి ఎక్కువ మొత్తంలో నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. ఈ క్రమంలో చాలామందిని చెమటకాయల సమస్య వేధిస్తూ ఉంటుంది. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, వీపు, పొట్ట, చేతులు మొదలైన భాగాల్లో ఏర్పడతాయి. ఈ క్రమంలో బయట దొరికే పౌడర్లు, క్రీములు వద్దనుకునేవారు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


- మటకాయలు ఏర్పడినప్పుడు చల్లటి ఐస్‌ ముక్కలు శరీరానికి ఉపశమనాన్నిస్తాయి. చిన్నచిన్న ఐస్‌ముక్కల్ని ఎర్రగా ఉన్న చెమటకాయలపై రుద్దాలి. ఇలా చేస్తే మంట తగ్గిపోయి తద్వారా చెమటకాయలూ తగ్గుతాయి.
- కొన్ని వేపాకుల్ని తీసుకుని నీళ్లు పోస్తూ మెత్తటి పేస్ట్‌లా నూరుకోవాలి. ఈ పేస్ట్‌ని చెమటకాయలున్న చోట పూసి పూర్తిగా ఆరనివ్వాలి. వేపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంపై ఉండే క్రిములు నాశనమై ఏవైనా ఇతర చర్మవ్యాధులుంటే కూడా తొలగిపోతాయి.
- చందనం పొడి, కొత్తిమీర పొడి ఈ రెండింటినీ ఒక్కోటి 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. ఇందులో 2 నుంచి 3 టేబుల్‌ స్పూన్ల రోజ్‌వాటర్ వేసి మృదువైన పేస్ట్ వచ్చే వరకు బాగా కలపాలి. ఈ పేస్ట్‌ ని చెమటకాయలున్న చోట పూయాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి.
- నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల చెమటకాయలు తగ్గిపోతాయి. రోజుకు 4 గ్లాసుల నిమ్మరసం తాగితే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
- కలబంద గుజ్జును చెమటకాయలుండే చోట కాసేపు పెట్టి ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.


చెమటకాయలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
- వేడి ఎక్కువగా ఉండే సమయాల్లో నీళ్లు బాగా తాగాలి.
- శరీరానికి వదులుగా ఉండే దుస్తుల్ని ధరించాలి.
- చర్మాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి.
- స్నానానికి రసాయనాలు ఎక్కువగా ఉండే సబ్బులు ఉపయోగించకూడదు.
- పడుకునే గదిలో చల్లగా, బాగా గాలి ఆడేలా వెంటిలేషన్ ఉంచుకోవాలి.
- వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చల్లగా ఉండే లేదా గాలి ఎక్కువగా ప్రసరించే ప్రదేశంలో ఉండటం మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa