ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ ​కు రెండో అతి పెద్ద ముప్పు ఇదేనా..?

national |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 12:01 PM

భారత్ కు కాలుష్యమే రెండో అతిపెద్ద ముప్పుగా ఉందని స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్‌ సంస్థ తెలిపింది. ఐక్యూఎయిర్‌ సంస్థ 'ప్రపంచ గాలి నాణ్యత నివేదిక- 2022' పేరుతో మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో మానవారోగ్యానికి ఈ కాలుష్యమే రెండో అతిపెద్ద ముప్పుగా ఉందని స్పష్టం చేసింది.


కాలుష్యం దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా దాదాపు రూ.11.47 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని వెల్లడించింది. వాతావరణంలో ప్రమాదకర పీఎం 2.5 దూళికణాల గాఢతను 2024 కల్లా 20-30% మేర తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన జాతీయ పరిశుభ్ర వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఈ నివేదిక తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa