రబీ సీజన్ లో రైతులు పండించిన పప్పు ధాన్యాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏప్రిల్ మొదటి వారం నుంచి పెసలు, మినుములను కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్‌లో 1,26,270 టన్నుల శనగలు, 91,475 టన్నుల మినుములు, 19,632 టన్నుల పెసలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనగలకు క్వింటాల్ రూ.5,230, పెసలు రూ.7,275, మినుము, కందులకు రూ.6,300 చొప్పున మద్దతు ధర ప్రకటించింది.
పంట నమోదు (ఈ-క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు రబీలో సాగు చేసిన పంట వివరాలను దగ్గర్లోని ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే ప్రాధాన్యత ఇస్తారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా రైతులకు తెలియజేస్తారు. కొనుగోలు వేళ రైతులకు ఈ-రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్‌ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ-సైన్ (ఈ-హస్తాక్షర్) అమలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa