ఇద్దరు భార్యలను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతని రెండో భార్య హత్య చేయించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి భవాని నగర గణపతి దేవస్థానం వద్ద ఈనెల 15న జరిగింది. దొడ్డబొమ్మన్నవర్(46) అనే వ్యక్తిని రెండో భార్య కిరణ సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమెతో పాటు ధర్మేంద్ర, శశికాంత్ అనే నిందితులను అరెస్ట్ చేశారు.
రాజు దొడ్డబొమ్మన్నవర్ మొదటి భార్య లాతూరులో ఉంది. ఇద్దరు భార్యలను కాదని రాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆస్తిని తన పిల్లల పేరున పెట్టాలని రెండో భార్య కిరణ భర్తతో గొడవ పడేది. ఈ క్రమంలో భర్తను హత్య చేయించాలని నిర్ణయించుకుంది. వ్యాపారంలో రాజుతో విభేదాల వల్ల ఆయనకు దూరంగా ఉన్న ధర్మేంద్ర, శశికాంత్ తో చేతులు కలిపింది. సంజయ్ రాజపుత్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి రాజును కత్తులతో పొడిచి హత్య చేయించారు. పోలీసులు అనుమానంతో రాజు రెండో భార్య కిరణ కాల్ డేటాను పరిశీలించి విచారించగా ఈ విషయం బయటపడింది. సంజయ్ రాజపుత్, అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa