ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పత్తికి రికార్డు ధర.. క్వింటాల్‌ కు రూ.11,111

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 12:28 PM

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ లో పత్తికి రికార్డు ధర లభించింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా క్వింటాల్‌ పత్తి ధర ఏకంగా రూ.11,111 పలికి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. పత్తి కొనుగోలు వ్యాపారులు పోటీపడి క్వింటాల్‌ పత్తిని రూ.11,111 వెచ్చించి కొనుగోలు చేశారు. ఆదోని పరిసర ప్రాంతాల్లో జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. దూది భేళాల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌ కు రాకపోవడంతో వ్యాపారులు పత్తి కోసం పోటీపడుతున్నారు. దీంతో పత్తికి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa