ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్తీ మద్యాన్ని పరీక్షించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 12:58 PM

అసలు ఈ ముఖ్యమంత్రి సిగ్గుందా? కల్తీ సారా వల్లే మరణించారని మృతుని కుటుంబ సభ్యులు చెప్పిన తరువాత, అన్ని రాజకీయ పార్టీలు ఇది కల్తీ మరణాలే, అని తేల్చిన తరువాత కూడా జగన్ రెడ్డి సిగ్గు లేకుండా, ఇవి సహజ మరణాలే అంటూ శాసనసభలో చులకన చేసి మాట్లాడటం అత్యంత దారుణం.ఈరోజు మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? కల్తీసారా, జె-బ్రాండ్ మద్యం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోయాయి. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా దీనిపై శాసనసభలో చర్చించి అరికట్టాలని ప్రయత్నిస్తే మాకు మైకు ఇవ్వలేదు, సస్పెండ్ చేసి బయటకు పంపారు.మద్యం పాలసీలో జరిగిన తప్పులను కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తే హౌస్ అరెస్టు చేశారు. ఒక శాసనసభ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా కనీసం ఆఫీసుకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రతిపక్షం ప్రజల్లోకి వెళితే ఎందుకంత భయం. ప్రజల ప్రాణాలు పోతుంటే జగన్ రెడ్డికి లెక్క లేదా?  రాష్ట్రంలో ఉన్న షాపుల నుంచి ఓ పది బాటిళ్లు తీద్దాం. వాటిని న్యాయస్థానం ద్వారా రాష్ట్రంలోనే అత్యున్నతమైన ల్యాబ్లో పరీక్షిద్దాం. జగన్ రెడ్డి బ్రాండెల్లో ఎలాంటి హానికరమైన రసాయనాలు వాడుతున్నారో కోర్టు ద్వారానే ప్రజలకు తెలుస్తుంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్ నాయుడు ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa