ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెగాసస్‌తో ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడిన నేరం నుంచి తండ్రీకొడుకులు తప్పించుకోలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 01:01 PM

నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ సభ్యులు జగన్ ని పొగుడుతుంటే , భజనలు ఆపి రాష్ట్ర ప్రజలకి మంచి చేసే దిశగా అడుగులు వెయ్యండి అని టీడీపీ వారు చిడతలు వాయించారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపి విజయ్ సాయి రెడ్డి .... ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించడం ఏమిటి? 'జయము జయము చంద్రన్నా' అంటూ టీడీపీ ఆఫీసులో రోజూచేసే భజనను మానుకోలేకపోతున్నారు. 2024 ఎన్నికల తర్వాత ఎలాగూ చిడతలు వాయించుకోక తప్పదు. ఈలలు వేసి, గోల చేయడం పోకిరీలు చేసే పని. పెగాసస్‌తో ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడిన నేరం నుంచి తండ్రీకొడుకులు తప్పించుకోలేరు. పోలీసు ఇన్వెంటరీలో నమోదు చేయకున్నా పెగాసస్ వాడింది వాస్తవం. నిండుసభలో బెంగాల్ సీఎం మమత ఊరికే అనరు కదా. తప్పించుకోవడానికి వ్యవస్థలపై ఆశలు పెట్టుకోవచ్చు. జనాలు మాత్రం మళ్ళీ బండకేసి ఉతుకుతారు. పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదని చెబుతున్నా పచ్చ కుల మీడియా మాత్రం గింజుకోవడం ఆపడం లేదు. టీడీపీ ఉనికి నానాటికీ తగ్గిపోతున్నదన్నదే దాని బాధ. ఆ బాధతోనే తప్పుడు కథనాలను వండి వారుస్తోంది. పచ్చకుల మీడియా రాతలను  నమ్మడం జనం ఎప్పుడో మానేశారు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa