ఈ మధ్య కచ్చిడి చేప పేరు జనాల నోళ్లలో బాగా నానుతుంది. అందుకు కారణం దాని రేటు. ఈ రకం చేప జాలర్లకు మంచి సుడి ఉన్న రోజు చిక్కుతుంది. ధర అయితే ఓ రేంజ్‌లో పలుకుతుంది. మగ చేప అయితేనే మార్కెట్‌లో పీక్స్‌లో డిమాండ్ ఉంటుంది. దీన్ని కొనేందకు వ్యాపారులు పోటీ పడతారు. ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని.. అందుకే అంత రేటని వ్యాపారాలు చెబుతారు. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ ఫిష్‌ను వినియో గిస్తుంటడంతో డిమాండ్ ఇంకా పెరిగింది. దీనిని గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు గోల్డ్ దొరికనట్టే అని భావిస్తారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద ఇరవై ఎనిమిది కేజీల మగ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ చేపను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామానికి చెందిన వ్యాపారి 2,90,000 రూపాయలకు కొనుగోలు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa