గోవా ప్రజలకు ఏడాదికి మూడు ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శాసనసభలో చెప్పారు. దీనికోసం 2022-23 గోవా బడ్జెట్ లో రూ.40కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం చెప్పారు. రెండోసారి సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ప్రమోద్ సావంత్ 2022-23 బడ్జెట్ ను అసెంబ్లీకి సమర్పించారు. గోవా ప్రజల శ్రేయస్సు కోసం తాను సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్ ను ప్రవేశపెట్టానని సీఎం సావంత్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa