గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు భారీగా పెంచాయి. గృహాల్లో వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై ధరలు స్థిరంగానే ఉన్నాయి. దాని ధర ప్రస్తుతం రూ.1002 వద్దే ఉంది. అయితే వాణిజ్య వినియోగంలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం భారీగా పెరిగింది. ఏకంగా రూ.273.50ను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.2186 నుంచి 2460కు అమాంతంగా పెరిగింది. దీంతో హోటళ్లలో తినుబండారాలు, ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది.