ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా నగరం బెల్గోరడ్‌లో ఉన్న చమురు డిపోలో భారీగా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఈ డిపోపై దాడి చేయడంతో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. రష్యా భూభాగంలో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ హెలికాఫ్టర్లు ఈ దాడి చేశాయి. అంతకు ముందు అదే ప్రాంతంలో ఉన్న ఆయుధ డిపోపై ఉక్రెయిన్ బలగాలు దాడిచేసి ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa