ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాడు తలబిరుసుతనం...నేడు శిరస్సు వంచి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 09:59 PM

కొందరు ఉన్నతాధికారుల తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించడంపై ఆయన స్పందించారు. చంద్రబాబు హయాంలో తలబిరుసుగా మాట్లాడిన ఐఏఎస్ లు ఇప్పుడెందుకు తలదించుకుంటున్నారు? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఐఏఎస్ లు ఎందుకు పాలకుల అడుగులకు మడుగులు వత్తుతున్నారు? అని నిలదీశారు. జగన్ ప్రభుత్వంలో పనిచేసిన సీఎస్ లు కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారని విమర్శించారు. 8 మంది ఐఏఎస్ లు దోషులుగా నిలబడడం రాష్ట్ర ప్రజలకే అవమానం అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa