తెలుగు పత్రిక ప్రపంచంలో సంచలనంగా వెలువడిన సూర్య దినపత్రిక స్థాపించి ఇప్పటికే 15 వసంతాలు పూర్తయిన విషయం తెలిసిందే. సూర్య దిన పత్రిక ప్రింట్ మీడియా లోనే కాకుండా , డిజిటల్ మీడియాలోనూ ఈ పదిహేను సంవత్సరాలలో తనదైన ముద్ర వేసుకుంది. తాజా రాజకీయ, వ్యాపార వాణిజ్య వార్తలతో పాటు సినిమా, క్రీడల న్యూస్ అప్టేట్స్ ను అందిస్తూ అందరి మన్నలను పొందుతూ అగ్రశ్రేణి వెబ్ సైట్ గా దూసుకువెళుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ పాఠకుల కోసం ... సూర్య తెలుగు దినపత్రిక వెబ్ సైట్ ను మరింతగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ తెలుగు , ఇంగ్లీష్ భాషలలో నెటిజనులకు అందుబాటులో కి సూర్య యాజమాన్యం తీసుకు వచ్చింది. సరికొత్త హంగులతో, ఆకర్షణీయంగా ముస్తాబైన సూర్య వెబ్ సైట్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తన చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా గా కృష్ణ దాస్ మాట్లాడుతూ సూర్య తెలుగు దినపత్రిక మాదిరిగానే సూర్య తెలుగు, ఇంగ్లీష్ వెబ్సైట్ లు మరింతగా నెటిజన్ల ఆదరణ చూరగొని అగ్ర స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa