ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రెజిల్‌లో విరుచుకుపడుతున్న వరదలు.. 14 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 10:38 AM

బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోలో ఆకస్మిక వరదలు శనివారం విరుచుకుపడ్డాయి. ఫలితంగా కొండ చరియలు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. ఈ ఘటనలో పడి 8 మంది చిన్నారులతో సహా తల్లి మృతి చెందింది. మొత్తంగా 14 మంది వరదల కారణంగా మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. రానున్న రెండు రోజులు కూడా ఇదే తరహాలో భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరిలో బ్రెజిల్‌లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో వర్షాల ధాటికి మట్టి పెళ్లలు విరిగి పడి 233 మంది కన్నుమూశారు. ఆ విషాధ ఘటన మరువక ముందే మరో ఉపద్రవం రావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa