అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గ్లోబల్ ఇండెక్స్‌లో అదానీ 10వ స్థానంలో ఉండగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంబానీ 11వ స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ కూడా సెంటిబిలియనీర్ అయ్యారు. 100 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తిగా ఆయన నిలిచారు. అదానీ గత సంవత్సరంలో తన నికర ఆస్తుల విలువకు 23.5 బిలియన్ల డాలర్లు జోడించారు. తాజా జాబితాలో ఆయన ఆర్జించిన మొత్తమే అత్యధికం. అదే సమయంలో అంబానీ తన నికర ఆస్తుల విలువ 9.03 బిలియన్ల డాలర్లను పెంచుకున్నారు. 59 ఏళ్ల అదానీ దేశంలో పోర్ట్‌లు, ఎయిర్ పోర్టులు, థర్మల్ ఎనర్జీ తదితర పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. టెస్లా అధినేత ఎలోన్ మస్క్ 273 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 88 బిలియన్ల డాలర్ల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa