ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై పై పంజాబ్ ఘనవిజయం

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 07:53 AM

ఐపీఎల్‌-2022లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో ఓటమి చవిచూసింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో చెన్నై ఓటమి పాలైంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ 3, వైభవ్‌ ఆరోరా, లివింగ్‌ స్టోన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా, రబడా, ఆర్షదీప్‌ సింగ్‌, స్మిత్‌ తలా వికెట్‌ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్స్ లో శివమ్ దుబే 57 మాత్రమే రాణించాడు. ఈ సీజన్ లో చెన్నైకి ఇది వరుసగా మూడో ఓటమి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa