ఏపీలో సోమవారం నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య సీఎం జగన్ నూతన జిల్లాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దీంతో కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో పరిపాలన ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడంతో జిల్లాల సంఖ్య 26కు పెరిగింది. ఇప్పటి వరకు ఉన్న 51 డివిజన్ల సంఖ్యను ప్రభుత్వం 73కి పెంచింది. ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను, జిల్లా రెవెన్యూ అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.