భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై మరో 40 పైసలు పెంచుతూ చమురు సంస్థలు ఆదివారం రాత్రి ఉత్తర్వులిచ్చాయి. గడిచిన 14 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది 12వ సారి. కేంద్ర, రాష్ట్ర పన్నులను కలుపుకొని తెలంగాణలో ఈ పెంపు పెట్రోల్‌పై 45 పైసలు, డీజిల్‌పై 43 పైసలుగా ఉంది. తాజా పెంపుతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ.117.67, డీజిల్ ధర రూ.103.73 కు చేరుకుంది. ఈ ధరలు సోమవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర పన్నులను కలుపుకొని ఏపీలో ఈ పెంపు పెట్రోల్‌పై 44 పైసలు, డీజిల్‌పై 42 పైసలుగా ఉంది. ఈ ధరలు సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వస్తాయి.